కమీషన్ల కోసమే జీవో-39 - MicTv.in - Telugu News
mictv telugu

కమీషన్ల కోసమే జీవో-39

September 12, 2017

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జీవో-39 కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తూ జీవో -39 తీసుకురావడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం విచారించింది. నాయకుల కమీషన్ల కోసమే జీవో -39 ను తీసుకొచ్చారని పిటిషనర్ తరపు న్యాయవాది రచనా రెడ్డి అన్నారు. జీవో 39తో రెవిన్యూ వ్యవస్థ బలహీన పడుతుందని వాదించారు.

ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న హైకోర్ట్‌ రైతు సమితులకు విడుదల చేసిన రూ.500 కోట్లను ఏ విధంగా ఖర్చు చెస్తారో తెలపాలని ప్రభుత్వాన్ని కోరింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు రూ.500 కోట్ల నుంచి ఎలాంటి చెల్లింపులు జరపొద్దంటూ సూచించింది. దీనిపై మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.