mictv telugu

గో బ్యాక్ మోదీ.. జలదీక్షలో శివాజీ..

February 10, 2019

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా అధికార టీడీపీ, వామపక్షాలు, ప్రజాసంఘాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బ్లాక్ బెలూన్లతో, గో బ్యాక్ మోదీ అంటూ నిరసన తెలుపుతున్నారు. వాటిని మోదీ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. బ్లాక్ బెలూన్లు నాకు దిష్టి చుక్కల్లాంటివి, గో బ్యాక్ అంటే నేను మళ్ళీ రావాలనుకుంటున్నట్టు తనదైన శైలిలో చమత్కరించారు. ఇదిలా వుండగా సినీ నటుడు శివాజీ మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ జలదీక్ష చేపట్టారు. మోదీ దరిద్రపు కాలును ఏపీలో పెట్టారు, ఏపీ అపవిత్రం అయింది కాబట్టే తాను విజయవాడలోని కృష్ణా నదిలో జలదీక్ష చేస్తున్నానని ప్రకటించారు. నడుము లోతు నీటిలో దిగి ప్లకార్డులతో మోదీ గో బ్యాక్, మోదీ డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. మోదీ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లేవరకు తన జలదీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Telugu news Go back modi Shivaji at the jaladiksha .

బీజేపీ నేత జీవీఎల్ నరసింహా రావుతో పాటు ఆ పార్టీ నేతలపై శివాజీ విరుచుకుపడ్డారు. ‘నన్ను కెలకవద్దు.. కెలికారో.. మీ బొక్కలన్నీ బయటపెడతా’ అంటూ మండిపడ్డారు.

మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రాజకీయ తీవ్రవాదిని దేశం నుంచి బహిష్కరించే రోజులు ఎంతో దూరంలో లేవు. రాఫేల్ కుంభకోణం, రైతుల ఇన్సూరెన్స్ డబ్బులను కూడా మోదీ తినేశారు. మోదీ ప్రధాని కాదు, ఆయన రాజకీయ తీవ్రవాది. దేశంలో దుర్మార్గమైన రాజకీయాలు చేయడానికే ఆయన వచ్చారు. బీజేపీ, దాని అనుబంధ పార్టీలు ప్రజలను మోసం చేశామని అనుకుంటున్నాయనీ, ప్రజలు అమాయకులు కాదు’ అని వ్యాఖ్యానించారు శివాజీ. మోదీ పర్యటనను అడ్డుకుంటే ఏపీ ప్రభుత్వం తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతుందని బీజేపీ నేత జీవీఎల్ చెప్పడాన్ని శివాజీ తప్పుపట్టారు.Telugu news Go back modi Shivaji at the jaladiksha