mictv telugu

లక్ష కట్టి, మూలాన కూర్చో.. సీబీఐ మాజీ చీఫ్‌తో సుప్రీం

February 12, 2019

సీబీఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. బీహార్‌లోని ప్రభుత్వ వసతి గృహంలో బాలికలపై జరుగుతోన్న లైంగిక దాడుల కేసును విచారణ జరుపుతోన్న అధికారిని బదిలీ చేయడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. ఈ విషయంలో నాగేశ్వరరావు క్షమాపణలు చెప్పడాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ డైరెక్టర్‌గా నాగేశ్వరరావు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని స్పష్టం చేస్తూ ఆయనకు లక్ష రూపాయల జరిమానా విధించింది. విచారణ సమయంలో ఆగ్రహానికి గురైన రాజన్ గొగోయ్, నాగేశ్వరరావును సాయంత్రం వరకు కోర్టులో ఓ మూలాన కూర్చోవాలని ఆదేశించారు. ఆయనతో పాటు సీబీఐ డైరెక్టర్‌ ప్రాసిక్యూషన్‌ బాసూరాం కూడా దోషేనని ఆయనకు కూడా జరిమానా విధించింది.Telugu News 'Go Sit in a Corner of the Court': Ex-CBI Interim Chief Nageswara Rao Held Guilty of Contempt, Fined Rs 1 Lakhవీరు చేసినది పొరపాటుకాదని, ఉద్దేశపూర్వకమైన చర్య అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ అభిప్రాయపడ్డారు. కాగా, అంతకుముందు సీబీఐ మాజీ తాత్కాలిక చీఫ్‌ నాగేశ్వరావు సర్వోన్నత న్యాయస్ధానం ఉత్తర్వులను తాను కలలో కూడా ఉల్లంఘించనని పేర్కొన్నారు. బీహార్ ప్రభుత్వ బాలికల వసతి గృహం కేసును విచారిస్తున్న అధికారిని బదిలీ చేయడంలో కోర్టు అనుమతి తీసుకోకపోవడం తప్పేనని ఒప్పుకున్న నాగేశ్వరరావు, అందుకు సుప్రీం కోర్టుకు బేషరతుగా క్షమాపణ చెప్పారు. తన పొరపాటును తాను పూర్తిగా తెలుసుకునట్టు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదన్నారు.