mictv telugu

పార్కులో కరెంటోళ్ల పాములు.. చిన్నారి బలి

February 12, 2019

పెద్దోళ్లు నిర్లక్ష్యంగా ఉంటారని, వారి తోలుమందం తన ప్రాణాలను తీస్తుందని ఆ చిన్నోడికి తెలీదు. అందులో రోజుమాదిరే నిన్న కూడా ఆడుకోవడానికి వెళ్లాడు. ఎప్పుడూ పట్టుకుని ఆడుకునే స్థలంలోనే ఆడుకున్నాడు. బాల్ కోసం అక్కడి కరెంటు స్తంభం వద్దకు వెళ్లాడు. దాన్ని తాకేశాడు. ఆ స్తంభం చిన్నారి ప్రాణాలను తోడేసింది. స్తంభానికి కాసేపు అలాగే అంటుకు పోయిన బాలుడు తర్వాత దబ్బున కిందపడిపోయి విగతజీవిగా మారాడు. హైదరాబాద్ బండ్లగూడలోని పెబెల్ సిటీలో ఈ దారుణం జరిగింది.

అప్పా జంక్షన్ దగ్గరున్న పెబెల్‌ సిటిలో మౌనిష్ అనే బాలుడు తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. బాల్ కరెంట్ స్తంభం వద్ద పడిపోవడంతో అక్కడికి వెళ్లాడు. దాన్ని తీసుకునే క్రమంలో విద్యుత్‌ స్తంభాన్ని తాకాడు. కరెంట్ షాక్ తగిలి చనిపోయాడు. చుట్టుపక్కల కొందరు వెళ్తున్నా ఎవరూ ఈ సంగతి గమనించలేదు.

పిల్లలు ఆడుకునే స్థలంలో కరెంటు స్తంభాన్ని నిలపడమే కాకుండా దాని వైర్లను కూడా బయటికి వదిలేశారు విద్యుత్ శాఖ సిబ్బంది. స్తంభం కింద గుంతలోంచి అక్కడే ఉన్న ఇనుప ప్లేటుకు కరెంట్ సరఫరా అవుతోంది. ఆ విషయాలేవీ తెలియని మౌనిష్ అక్కడికెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. కనిపించకుండా చూడాలని, స్తంభం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశముందని అధకారులు ఎన్నో సార్లు చెప్పినా ఫలితం లేకపోయిందని స్థానికలు మండిపడతున్నారు. మౌనిష్ తల్లిదండ్రులు తమిళనాడు నుంచి వలస వచ్చారు.