బీర్లు తాగే అమ్మాయిల సంఖ్య పెరిగింది! - MicTv.in - Telugu News
mictv telugu

బీర్లు తాగే అమ్మాయిల సంఖ్య పెరిగింది!

February 10, 2018

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్  శుక్రవారం గోవాలో జరిగిన స్టేట్ యూత్ పార్లమెంట్‌లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ  ‘గోవాలో అమ్మాయిలు బీర్లు తాగటంలో చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఈ రెండేళ్లలో బీర్లు తాగే అమ్మాయిల సంఖ్య పెరిగింది, ఈ రకంగా అమ్మాయిలు బీర్లు తాగడం ఆందోళనగా ఉంది…అమ్మాయిలు బీర్లు తాగే తీరు చూస్తుంటే నాకు భయమేస్తుంది.అందరూ తాగుతున్నారని నేను అనటం లేదు..తాగేవాళ్ల గురించి చెబుతున్నాను. గోవా యువత  కష్టపడేందుకు ఇష్టపడడంలేదు..ఎందుకంటే  లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల కోసం క్యూలైన్లో యువత బారులు తీరడమే నిదర్శనం’ అని  పారికర్ ఆవేదన వ్యక్తం చేశారు.