లోకంలోని చెత్తనాయాళ్లందరూ గోవాకు.. - MicTv.in - Telugu News
mictv telugu

లోకంలోని చెత్తనాయాళ్లందరూ గోవాకు..

February 10, 2018

పర్యాటక ప్రాంతమైన గోవాకు వెళ్లే ఇతర రాష్ట్రాల వారిని ఆ రాష్ట్ర పట్టణ,ప్రణాళిక మంత్రి విజయ్ సర్దేశాయ్  ఘోరంగా అవమానించారు. వారంత అలగా జనమని అభివర్ణించారు .ఉత్తరాది పర్యాటకులు గోవాను మరో హరియాణాలా మార్చాలనుకుంటున్నారని ఆరోపించారు. గోవా బిజ్ ఫెస్ట్ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…

గోవా ఉత్తరాది  పర్యాటకుల మీద ఆధారపడి ఉంటుందని, కానీ వాళ్లు గోవాకు ప్రతిఫలంగా  ఇస్తున్నదని మురికి, అప్రతిష్ట  అని  అన్నారు. గోవా వస్తున్న దేశీయ పర్యాటకుల్లో చాలా మంది ఈ భూమి మీద అలగాజనమేనన్నారు. రాష్ట్ర జనాభా కన్నా ఆరు రెట్ల మంది  గోవాకు వస్తున్నారని చెప్పారు. వీళ్లు  అసలు ఉన్నత స్థాయికి చెందిన వారు కాదని, పనికిమాలిన వాళ్లని విజయ్ అన్నారు.

భారతదేశం  మిగతా ప్రాంతం కన్నా గోవా అత్యున్నతమైనదని సర్దేశాయ్ చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న బాధ్యతారహితులైన పర్యాటకులను నియంత్రించడం కష్టమని తెలిపారు. గోవా ప్రజలు తలసరి ఆదాయం, సాంఘిక, రాజకీయ చైతన్యం, ఆరోగ్యం వంటి అనేక రంగాల్లో మిగతా దేశం కన్నా ఎంతో ఉన్నతంగా  ఉందని విజయ్ అన్నారు.