విమానాలను అడ్డుకున్న దేవుడు - MicTv.in - Telugu News
mictv telugu

విమానాలను అడ్డుకున్న దేవుడు

October 28, 2017

దేవుడు విమానాలను అడ్డుకోవడమేంటి  అనుకుంటున్నారా? అవును తిరువనంతపురం ఎయిర్ పోర్ట్ దగ్గర ఈ సంఘటన  ప్రతి సంవత్సరం జరుగుతుంది. తిరువనంతపురంలో ఓ ప్రముఖ పాత గుడిలో ఉన్న దేవుడిని ప్రతీ సంవత్సర అక్టోబర్ నెలలో  షంగ్ముగం  బీచ్‌లో స్నానం చేయిస్తారు. అయితే గుడికి, బీచ్‌కి మధ్యలో ఎయిర్ పోర్ట్ ఉంది.  

శనివారం సాయంత్రం 4 గంటలనుంచి  9 గంటల వరకు దేవుడి ఊరేగింపు సమయంలో,  ఆ ఎయిర్ పోర్ట్ లో ఉన్న అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. సంవత్సరంలో రెండు సార్లు ఇలా చేస్తారు.  దేవుడిని  ఏనుగుల మీద ఊరేగిస్తూ బీచ్ కు తీసుకెళ్తారు. 3400 మీటర్లున్న ఎయిర్ పోర్ట్ రన్‌వే‌పై వెళ్లే  దేవుడి ఊరేగింపులో, వందల మంది భక్తులు , పోలీసులు  దేవుడికి కాపలాాగా వెంట ఉంటారు.  దేవుడికి  బీచ్‌లో స్నానం అనేది  పురాణం నుంచి ఆచరిస్తున్న ఆచారమట.  సంవత్సరంలో ఈ రెండు రోజులు, దేవుణ్ణి ఎప్పుడు  స్నానానికి తీసుకెళ్తాం అనే సమాచారాన్ని,  ఎయిర్ పోర్ట్ కు చాలారోజుల  ముందే  అందిస్తారట గుడి అధికారులు.