mictv telugu

బంగారం బిగ్ షాక్ .. ధర రూ. 33,333

January 10, 2019

బంగారం నిజంగానే బంగారం అనిపించుకుంది. ధరలో మోత మోగించింది. 10 గ్రాముల స్వచ్చమైన బంగారం 10 గ్రాములు రూ. 33,333 చేరుకుని కొనుగోలుదారుల గుండెల్లో రైళ్ల పరిగెత్తించింది. జీఎస్టీని మినహాయిస్తే ఐదేళ్లలో ఇదే రికార్డు ధర.

Telugu news Gold hits five-year high, crosses Rs 33,000 mark on macroeconomic risks  Customers stay away from buying, price quoting at discount to landed cost of imported gold

అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ఉత్పత్తి తగ్గడం, దేశీయంగా డిమాండ్ పెరగడంతో పసిడి.. కొండెక్కి కూర్చుంది. ముంబైలో 99.9 స్వచ్ఛత ఉన్న బంగారం జీస్టీతో కలుపుకుని రూ.33,333కు చేరింది.99.5 స్టాండర్డ్ బంగారం రూ. 32,090 పలికింది. వెండి కూడా కిలోకు రూ.410 పెరిగి రూ.40,510కి చేరింది.  రూపాయి విలువ పడిపోవడం కూడా బంగారం మండిపోవడానకి కారణంగా మారింది. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 1,294.15 డాలర్ల వద్ద సాగుతోంది.

Telugu news Gold hits five-year high, crosses Rs 33,000 mark on macroeconomic risks  Customers stay away from buying, price quoting at discount to landed cost of imported gold