ఫేస్ బుక్ యూజర్లకు శుభవార్త - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్ బుక్ యూజర్లకు శుభవార్త

September 12, 2017

ఫేస్ బుక్ వినియోగదారులకు ఒక సంబరపడే వార్త. మీరు ఇంటర్నెట్, వైఫై కనెక్షన్ లేకుండానే వీడియోలను డౌన్ లోడ్ చేసుకుని కొత్త ఆప్షన్ ను తీసుకువస్తోంది. వీడియోలు చూడాలనుకున్నవాళ్ళకింకా చూసుకున్నంత పండగే. దీనికోసం ఎఫ్ బీ కొత్త టూల్ ను రెడీ చేస్తోంది. యూట్యూబ్‌లోని ఆఫ్‌లైన్‌ వీడియోల తరహాలోనే ఇదీ పని చేస్తుంది. వైఫై పరిధిలో మొబైల్‌ ఉన్నప్పుడు యాప్‌లో కొన్ని వీడియోలు డౌన్‌లోడ్‌ అవుతాయి. ఆ తర్వాత ఎప్పుడైనా ఆ వీడియోలను నెట్‌ కనెక్షన్‌ లేకుండానే వీక్షించొచ్చు. బాగుంది కదూ ఈ ఆప్షన్. పాపం జుకర్ బర్గ్ కు ఎఫ్ బీ వినియోగదారుల మీద ప్రేమ ఎక్కువైనుట్టున్నది. అందుకే వితౌట్ ఇంటర్ నెట్ ఎఫ్ బీ వాడకాన్ని తీసుకొస్తుందంటే ఇది చాలా హర్షించదగ్గ విషయమే.

వీడియోలను ఆఫ్‌లైన్‌ సేవ్‌ చేసుకునే ఆప్షన్‌ ప్రస్తుతమూ ఉంది. అయితే ఇందులో ఆయా వీడియోలను మీరే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. కొత్త ఆప్షన్‌లో మీ ప్రమేయం లేకుండానే వీడియోలు డౌన్‌లోడ్‌ అవుతాయి. ఏవి ఆఫ్‌లైన్‌లోకి వెళ్లాలనేది మీరు ఎంచుకున్న ప్రాధాన్యాలను (ప్రిఫరెన్స్‌) బట్టే ఉంటుంది. ఇలా డౌన్‌లోడ్‌ అయిన వీడియోలపైన మెరుపు (లైట్నింగ్‌) గుర్తు ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆప్షన్‌ ప్రయోగాత్మకంగా కొందరికి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలో అందరూ వినియోగించుకోవచ్చు. ఇంకే ఇప్పటికే ఈ ఫోన్ల వల్ల చాలామంది చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోలేనంత మొద్దుబారిపోయారు. ఈ ఆప్షన్ గనక వస్తే ఇంకెవ్వరూ నిద్ర పోరు, టైంకు తిండి కూడా తినకుండా 24 గంటలు అందులోనే ముఖం పెట్టి ఎఫ్ బీకి అతుక్కుపోతారేమో ?