కువైట్ క్షమాభిక్ష అర్హులకు ‘ జాగృతి ’ శుభవార్త - MicTv.in - Telugu News
mictv telugu

కువైట్ క్షమాభిక్ష అర్హులకు ‘ జాగృతి ’ శుభవార్త

February 19, 2018

అరబ్ దేశానికి వలస వెళ్ళి అక్కడ పనుల్లేక, పస్తులుంటూ, ఇక్కడికి రావటానికి డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నవారి కోసం ఓ శుభవార్త. కువైట్‌లో క్షమాభిక్ష ( ఆమ్నెస్టీ )కి అర్హులైన ఇండియన్స్‌కు తెలంగాణాకు రప్పించే ప్రయత్నం జరుగుతోంది.

ఆమ్నెస్టీకి అర్హులైన తెలంగాణ వాళ్లు ఇండియాకు రావాలని అనుకొని టికెట్‌కు డబ్బులు లేకుండా ఉన్నవాళ్లు ఎవరైనా ఉంటే [email protected] కు మెయిల్ చేయండి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదేశాల మేరకు వీళ్లకు సహాయం చేయడం జరుగుతుంది ’ అని తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి ఒక ప్రకటనలో తెలిపారు. కువైట్‌లో ఆమ్నెస్టీ ఈ నెల 22తో ముగియనున్న సందర్భంగా జాగృతి ఈ ప్రకటన చేయటం చాలా మందికి ఊరట కలిగిస్తోంది.