గూడ్స్ రైలు పైనుంచి పోయింది.. అయినా కూడా? - MicTv.in - Telugu News
mictv telugu

గూడ్స్ రైలు పైనుంచి పోయింది.. అయినా కూడా?

November 18, 2018

అదృష్టం ఉంటే ఎంతటి ప్రమాదాన్ని అయినా తప్పించుకోవచ్చు అంటారు పెద్దలు. ఇందుకు నిదర్శనం ఈ వీడియోలో ఉన్న వ్యక్తే. అనంతపురంకు చెందిన ఓ వ్యక్తి పట్టాలు దాటడానికి ఆగి ఉన్న గూడ్స్ రైలు కిందకి దూరాడు అదే సమయంలో ఆ గూడ్స్ రైలు ఒక్కసారిగా కదిలింది. దీంతో ఈ దృశ్యాన్ని చూస్తున్న ప్రయాణికులు ఏమవుతుందోనని కంగారు పడ్డారు.

కానీ ఆ వ్యక్తి మాత్రం సమయస్ఫూర్తిని ఉపయోగించి పట్టాల మీద ట్రైన్ తగలకుండా బిగదీసుకుని పడుకున్నాడు. ట్రైన్ పూర్తిగా వెళ్ళిపోయిన తరువాత లేచి ప్లాట్‌ఫామ్ పైకి వెళ్ళాడు. ఈ సంఘటనకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పట్టాల మీద దాటవద్దని రైల్వేశాఖ ఎన్ని నిబంధనలు పెట్టినా కూడా ప్రజలు పట్టించుకోవడం లేదని అధికారులు తెలియజేస్తున్నారు.

Telugu News goods train passes over person in anantapur video viral