మన భాష రానోళ్లతోనూ ఈజీగా టాకొచ్చు..

 ప్రపంచం కుగ్రామమైపోయింది. ఇంటర్నెట్ విప్లవం దేశాలను, మనుషులను చేరువ చేసింది. అయితే భాష విషయంలో ఇంకా కొన్ని అడ్డంకులు ఉన్నాయి. వాటిని అధిగమించేందుకు గూగుల్ సంస్థ సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది. ఇకపై భాష రాకపోయినా కూడా ఇతరులతో మాట్లాడే వెసులుబాటు త్వరలో అందుబాటులోకి తీసుకరానుంది. తన గూగుల్ అసిస్టెంట్ ద్వారా ఈ సేవలను అందించబోతుంది. లాస్ వేగాస్‌లో జరుగుతోన్న కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ సదస్సులో ఈ ఫీచర్‌కు సంబంధించిన బీటా వెర్షన్‌ను అందరి ముందు పరీక్షించింది.

గూగుల్ అసిస్టెంట్‌లో ఇంటర్‌ప్రిటర్ మోడ్ అనే ఫీచర్‌ ఉంటుంది. దీని సాయంతోనే భాష రాకున్నా కూడా ఎదుటి వారితో సంభాషించవచ్చు. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే… ఏ భాషలోకి అనువాదం అవసరమో ఆ భాషను ముందుగా ఓకే చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల గూగుల్ అసిస్టెంట్ యూజర్లు మాట్లాడే భాషను వారు ఎంపిక చేసుకున్న భాషలోకి మారుస్తుంది. ప్రస్తుతం 27 భాషాల్లో ఇంటర్‌ప్రిటర్ మోడ్‌ను పరీక్షించారు. రానున్న కొద్ది రోజుల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని గూగుల్ సంస్థ తెలిపింది. ఇంటర్‌ప్రిటర్‌తో పాటు గూగుల్ తన అసిస్టెంట్‌ ప్లాట్‌ఫామ్‌కి మరిన్ని ఫీచర్లను జోడించింది. దీంతో పిక్సెల్ ఫోన్‌లోని ఒక ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్లలోకి రానుంది. పిక్సెల్ ఫోన్ లాక్‌లో ఉన్నా కూడా గూగుల్ అసిస్టెంట్ సాయంతో అన్‌లాక్ చేయవచ్చు. అయితే ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ సౌకర్యం లేదు. అయితే త్వరలో ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. గూగుల్ అసిస్టెంట్ మన ఫోన్‌ను లాక్‌లో ఉన్నా కూడా అన్‌లాక్ చేస్తుంది. దీని కోసం ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లో ఈ ఆప్షన్‌ను ఓకే చేసుకోవాల్సి ఉంటుంది.

Telugu News Google Assistant’s new interpreter mode can translate conversations — but it’s not magic