గూగుల్ మ్యాప్స్‌ కొత్త ఫీచ‌ర్‌.. కునుకు తీసోటోళ్లు మాత్రమే! - MicTv.in - Telugu News
mictv telugu

గూగుల్ మ్యాప్స్‌ కొత్త ఫీచ‌ర్‌.. కునుకు తీసోటోళ్లు మాత్రమే!

December 18, 2017

గూగుల్ మ్యాప్స్.. ఇది ఫోన్లో ఉంటే చాలు..  అడ్సస్‌లు తెలియని వారు ఎవ్వరినీ అడగాల్సిన ఉండదు..  ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవఃసరం ఉండదు.. అదే మనం వెళ్లాల్సిన  గమ్యాన్ని చూపిస్తుంది.  గూగుల్ మ్యాప్‌లో త్వరలో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.

మీ గమ్య స్థానాలను అందులో ఎంటర్ చేస్తే చాలు.. గమ్య స్థానాన్ని  పొరపాటున మీరు మరిచినా కూడా గూగుల్ మ్యాప్స్ మరిచిపోదు. మీరు దిగాల్సిన చోటు వచ్చేసింది అని రెండు స్టేషన్ల ముందు నుంచే నోటిఫికేషన్‌తో మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. బస్సుల్లో, రైళ్లల్లో దూర ప్రయాణం చేసేవాళ్లు  దిగాల్సిన గమ్యం చాలా దూరం ఉందిలే  అని ఓ కునుకు తీస్తారు. కానీ దిగాల్సిన చోటు దాటిపోయినా కూడా మంచి నిద్రలో ఉంటారు.

అటువంటి వారికి ఈ ఫీచర్ చాలా ఉపయోగపడుతుంది.  మతిమరుపు గజినీలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. డిసెంబర్  నెలాఖరులోపల ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెస్తామని గూగుల్ స్పష్టం చేసింది.