mictv telugu

ఆ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే చంపేయండి..

January 10, 2019

టెక్నాలజీతోపాటు మోసాలూ పెరుగుతున్నాయి. మొబైల్ ఫోన్ల ద్వారా లావాదేవీలు సాగుతుండడంతో మోసగాళ్లు ఫేక్ యాప్స్ ద్వారా డబ్బులు కొల్లగొడుతున్నారు. డేటా చోరీకి పాల్పడుతున్నారు. మరెన్నో నేరాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తన ప్లే స్టోర్‌లో ఉన్న 85 ప్రమాదకర అప్లికేషన్లను గూగుల్ తొలిగించింది. వీటిలో ఇప్పటికే కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్న యాప్‌లు కూడా ఉన్నాయి.  ఆండ్రాయిడ్‌ ప్లే స్టోర్‌లో ఉన్న గేమ్‌, టీవీ అండ్‌ రిమోట్‌ కంట్రోల్‌ సిములేటర్‌ వంటి యాప్స్‌ నుంచి యూజర్ల డేటాకు ప్రమాదం ఉందని ట్రెడ్‌ మైక్రో సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ ఇటీవల చెప్పడంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఫుల్‌ స్క్రీన్‌ యాడ్స్‌,  డివైస్‌ స్క్రీన్‌ అన్‌లాకింగ్‌కు సంబంధించిన యాప్‌లు చాలా ప్రమాదకమని గూగుల్ పేర్కొంది. ఈజీ యూనివర్సల్‌ టీవీ రిమోట్‌ వంటి యాప్‌లను ఒక ఓపెన్‌ చేసిన ప్రతిసారీ ఫుల్‌ స్క్రీన్‌ యాడ్‌ డిస్‌ప్లే అవుతుందని నిపుణులు వివరించారు.

telugu news   Google removes 85 adware apps that were installed by millions of users  Adware-infected apps masqueraded as games and TV remote controllers.

ప్రమాదకర యాప్‌లు ఇవే..  

-టీవీ వరల్డ్‌, పార్కింగ్‌ గేమ్‌,  స్పోర్ట్‌ టీవీ, వరల్డ్‌ టీవీ, ప్రాడో పార్కింగ్‌, సిములేటర్‌ 3డీ -ఐడిల్‌ డ్రిప్ట్‌, ఫ్రాన్స్‌ టీవీ,
చిలీ టీవీ టీవీ రిమోట్‌, ఏసీ రిమోట్‌, సిటీ ఎక్స్‌స్ట్రీమ్‌పోలీస్‌, అమెరికన్‌ మజిల్‌ కార్‌, బస్‌ డ్రైవర్‌, -చాలెంజ్‌ కార్‌ స్టంట్స్‌ గేమ్‌లవ్‌ స్టిక్కర్స్‌, క్రిస్‌మస్‌ స్టిక్కర్స్‌, బ్రెజిల్‌ టీవీ, యూకే టీవీ,   ఫొటో ఎడిటర్‌ కొలాగ్‌ 1, మూవీ స్టిక్కర్స్‌, రేసింగ్‌ కార్‌ 3డీ, ప్రాడో కార్‌, పోలీస్‌ చేజ్‌ వంటివి.
telugu news   Google removes 85 adware apps that were installed by millions of users  Adware-infected apps masqueraded as games and TV remote controllers.