గోపీచంద్ పంతం ఫస్ట్‌లుక్ - MicTv.in - Telugu News
mictv telugu

గోపీచంద్ పంతం ఫస్ట్‌లుక్

March 21, 2018

‘ ఆక్సీజన్ ’ ‘ ఆగడుగుల బుల్లెట్ ’ చిత్రాల తర్వాత గోపీచంద్ నటిస్తున్న 25వ సినిమా ‘ పంతం ’. ఈ చిత్రనికి సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కె. చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మెహరీన్ కథానయికగా నటిస్తోంది. పూర్తి స్థాయి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో వుంది.  పృథ్వీ, జయప్రకాష్ రెడ్డిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొంతకాలంగా సరైన హిట్లు లేక సతమతమవుతున్న గోపీచంద్‌కు ఈ సినిమా బ్రేక్ ఇస్తుందంటున్నారు చిత్ర యూనిట్. ‘ ల‌క్ష్యం’ ‘లౌక్యం’ ‘సౌఖ్యం’ ‘శౌర్యం’ తరహాలోనే ఈ సినిమా టైటిల్లో కూడా రెండు అక్షరాలనే పెట్టడం విశేషం.