మీ రూ.100 నోటు అసలుదా, నకిలీదా? చెక్ చేసుకోండి! - MicTv.in - Telugu News
mictv telugu

మీ రూ.100 నోటు అసలుదా, నకిలీదా? చెక్ చేసుకోండి!

November 19, 2018

పెద్ద నోట్ల రద్దు తర్వాత మన దేశ కరెన్సీలో అనేక మార్పులు వచ్చాయి. 2000 రూపాయల నోట్లతో మొదలైన కొత్త నోట్ల ముద్రణ ఇంకా కొనసాగుతూనే ఉంది. 500, 200, 50,10 రూపాయలను ముద్రించిన తరువాత కొత్త వందరూపాయల నోటును కూడా ముద్రించారు. కానీ ఈ కొత్త వందరూపాయల నోట్లు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఇవి ఎవరికైనా వెళితే వారు వీటిని ఎంతో అపురూపంగా దాచుకుంటున్నారు.

అధికారిక గణాంకాల ప్రకారం 2017-2018 వ సంవత్సరానికి గాను పట్టుబడిన దొంగనోట్లతో కొత్తగా ప్రవేశపెట్టిన వంద రూపాయల నోట్లే ఎక్కువగా ఉన్నాయట. దీంతో కొత్త వందరూపాయల నోట్లను తీసుకోవాలంటేనే ప్రజలు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో అసలైన 100 రూపాయల నోట్లను గురించడం ఎలానో తెలుసుకుందాం..!Telugu news Got a New Rs 100 Note In Your Wallet? Here’s How You Check If It’s Real or Fake! They are lavender-coloured and carry the motif of ‘Rani-Ki-Vav’ (The Queen’s Stepwell), a UNESCO World Heritage site in Gujarat.అసలైన నోటు ముందు భాగంలో

 1. 100 మొదలయ్యే రిజిస్టర్ నంబర్ ఉంటుంది.
 2. దేవనగరి లిపిలో १०० అని ఉంటుంది.
 3. నోటుకు మధ్యలో మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది
 4. సూక్ష్మ అక్షరాలలో ‘RBI’, ‘भारत’, ‘India’ మరియు ‘100’ అని రాసి ఉంటుంది.
 5. సెక్యూరిటీ త్రెట్(దారం)పైన भारत, RBI అక్షరాలు ఉంటాయి. నోటును వంచినప్పుడు దారం రంగు ఆకుపచ్చ రంగు నుంచి నీలి రంగుకు మారుతుంటుంది.
 6. కుడివైపు అశోక స్తంభం

7 మధ్యలో గాంధీ ఎలక్ట్రోటైప్ వాటర్ మార్కులు

 1. నంబర్ ప్యానల్ ఎడమవైపు పైభాగంలో, కుడివైపు కింది భాగంలో చిన్నసైజు నంబర్లతో మొదలై పెద్దసైజు నంబర్లతో ముగుస్తుంది
 2. దృష్టి సంబంధ సమస్యలు ఉన్నవారు గుర్తించేందుకు గాంధీ బొమ్మ, అశోక స్తంభం కాస్త ఉబ్బెత్తుగా(ఇంటాగ్లియో) ఉంటాయి.

వెనుకవైపు..

 1. ఎడమవైపు నోటు ముద్రించిన సంవత్సరం
 2. స్వచ్ఛ భారత్ లోగో, నినాదం
 3. భాషల ప్యానల్
 4. రాణి బావి బొమ్మ
 5. దేవనాగరి లిపిలో  १००

మీ వీద్ద ఉన్న నోటులో ఇవన్నీ ఉంటే అది అసలైన నోటే. లేకపోతే దొంగనోటుగా భావించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి. నకిలీ నోటు కలిగివుండం, మార్చడం ఐసీసీ సెక్షన్ 489 కింద నేరంగా పరిగణించి, జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తారు.