సర్కార్ బడి..కార్పోరేట్ చదువు - MicTv.in - Telugu News
mictv telugu

సర్కార్ బడి..కార్పోరేట్ చదువు

February 2, 2018

ఈరోజుల్లో సర్కార్ బడి అంటే  ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అరకొరగా ఉండే సౌకర్యాలు, టీచర్ల కొరత.  మా పిల్లలను సర్కారు బడికి పంపిస్తే వారికి చదువు సక్కగ వస్తుందో రాదో అని వేలకు వేలు ఫీజులు కట్టి మరీ కార్పోరేట్  స్కూల్లో చదివిస్తారు తల్లిదండ్రులు. అయితే రాజ్‌భవన్‌లోని  గవర్నమెంట్ స్కూల్  ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది.

పేరుకు గవర్నమెంట్ స్కూలే కాని అక్కడ కార్పోరేట్ స్కూళ్లను తలదన్నేలా సౌకర్యాలు, ఇంగ్లీషులో బోధన, డిజిటల్ తరగతులు ఇలా ఎన్నో ఆధునిక హంగులు ఉన్నాయి. ఈ స్కూళ్లో తమ పిల్లలకు అడ్మిషన్ దొరికితే అదే అదృష్టం అని చాలామంది తల్లి దండ్రులు అక్కడికి క్యూ కడుతున్నారు.