పత్రికా ప్రకటనల ధరలు పెంచిన ప్రభుత్వం - MicTv.in - Telugu News
mictv telugu

పత్రికా ప్రకటనల ధరలు పెంచిన ప్రభుత్వం

January 9, 2019

ప్రాంతీయ, చిన్న వ్యాపార పత్రికలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వ్యాపార పత్రికలకు జారీ చేసే ప్రకటనల ధరలను 25 శాతం పెంచింది. ప్రింట్ మీడియాలో ప్రకటన రేట్లు సవరిస్తూ సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. 8 వ రేట్ స్ట్రక్చర్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. సవరించిన రేట్లు మంగళవారం నుంచి మూడు సంవత్సరాల పాటు అమల్లో వుంటాయని వెల్లడించింది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఔట్రీచ్ అండ్‌ కమ్యూనికేషన్ ఒక ప్రకటన జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా న్యూస్‌ ప్రింట్‌, ప్రాసెసింగ్‌ చార్జీలు, ఇతర కారణాల రీత్యా ఈ పెంపుకు చర్యలు తీసుకున్నట్టు తెలిపింది.Telugu News Government woos print media before general elections, hikes ad rates by 25%ప్రభుత్వ నిర్ణయంతో ముఖ్యంగా రీజినల్, స్థానిక భాషలలో వెలుబడే చిన్న పత్రికలకు ప్రయోజనకరంగా ఉంటుందని పరిశ్రమ పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఈ నిర్ణయంపై విమర‍్శలు గుప్పించింది. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోతామన్న భయంతో అధికార బీజేపీ పార్టీ వేసిన మరొక ఎత్తుగడగా పేర్కొంది. డబ్బుతో మీడియాను నిశ్శబ్దం చేసేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. కాగా, గత ఎన్నికల సందర్భంగా 2013లో వ్యాపార ప్రకటనల రేట్లు పెరిగాయి. 2010 నాటి నుంచి 19 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు ప్రింట్‌ మీడియా ప్రకటనల రేట్లను ప్రభుత్వం 25 శాతం పెంచడంతో హెచ్‌టీ మీడియా, జీ, జాగ్రన్‌ ప్రకాశన్‌, డిబీ కార్పొ తదితర  మీడియా షేర్లు ఈరోజు మార్కెట్లో మెరుపులు మెరిపిస్తున్నాయి.

Telugu News Government woos print media before general elections, hikes ad rates by 25%