గవర్నమెంట్ టీచర్ టు మహారాజ్ బాబా ! - MicTv.in - Telugu News
mictv telugu

గవర్నమెంట్ టీచర్ టు మహారాజ్ బాబా !

February 16, 2018

అబ్బ గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు మన లైఫ్ సెటిల్ అనుకుంటారు కొందరు. కానీ  ఇతను మాత్రం చీ గవర్నమెంట్ జాబ్ లో ఏముంది, అదే నాలుగు దండలు మెళ్లో వేసి, అడ్డం పొడువు నాలుగు బొట్లు పెట్టి బాబా అవతారమెత్తామనుకో కూసున్న దగ్గరను కోట్లు వచ్చి పడతాయి అనుకున్నాడు. అందుకే  చేస్తున్న  గవర్నమెంట్ టీచర్ కొల్వును వదిలేసి మహారాజ్ బాబాగా అవతారమెత్తాడు.

నెల్లూరులో సుధాకర్ అనే వ్యక్తి గత కొన్నేండ్లుగా గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తున్నాడు.  పోరగాండ్లకు పాఠాలను చెబితే  నెల నెల జీతం వస్తది..రిటైర్ అయితే పించన్ వస్తది కానీ కోట్ల రూపాయలు ఏడ వస్తయ్ అనుకున్నడు. చేస్తున్న కొల్వును బందువెట్టి  ప్రజల మూడనమ్మకాలే పెట్టుబడిగా చేసకుని బాబా అవతారమెత్తాడు.

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చాలామంది ఈబాబాకు చాలా మహిమలు ఉన్నాయని ఆయన దగ్గరకు వచ్చి ఆశ్వీర్వాదం తీసుకుని వెళ్లేవారు. ఈక్రమంలో మీకు మీకుటుంబసభ్యుల క్షేమంకోసం 103 రోజుల హోమం చేస్తున్నాని భక్తులందరిని నమ్మించాడు. వాళ్ల దగ్గరనుంచి దాదాపు రూ.10 కోట్ల దాక వసూలు చేశాడు. ఆతర్వాత  ఆ డబ్బుతో జెండా ఎత్తెయ్యాలని చూశాడు.

కానీ శిష్యులే ఆ డబ్బును తీసుకుని తలోదిక్కు పారిపోయారు. ఇంకేముంది  ఈవిషయం తెలుసుకున్న భక్తులు దొంగ బాబా భరతం పడదామని ఆశ్రమానికి వచ్చారు. దీనితో వారికి దొరికితే నాబతుకు పులిహోరే అనుకున్నాడేమో  ఆశ్రమంలోనే పురుగుల మందు తాగాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న  దొంగబాబాను ఆసుపత్రిలో చేర్చి..కేసు నమోదు చేశారు పోలీసులు.