గౌరిని నేనే చంపా.. హిందూయువసేన నవీన్ - MicTv.in - Telugu News
mictv telugu

గౌరిని నేనే చంపా.. హిందూయువసేన నవీన్

March 3, 2018

‘గౌరీ లంకేశ్‌ను చంపింది నేనే ’ అని నవీన్ కుమార్ అనే వ్యక్తి ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. నవీన్ హిందూ అతివాద సంస్థలైన హిందూ యువసేన, సనాతన సంస్థ కార్యకర్త. నిందితుడు మాండ్యాలోని మద్దూర్‌కి చెందినవాడని.. గౌరీ లంకేశ్ నివాసం వద్ద సీసీటీవీ ఫుటేజీల్లోని వ్యక్తి చిత్రాలు అతనికి సరిపోలుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.కన్నడ సీనియర్ జర్నలిస్ట్ గౌరిలంకేశ్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. చాలా రోజులుగా నానుతూ వచ్చిన ఈ హత్య కేసులో కీలక ముందడుగు పడిందని తెలుస్తోంది. . గత ఏడాది సెప్టెంబరు 5న బెంగళూరులోని తన ఇంటి వద్దే గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత సమీపం నుంచి జరిపిన కాల్పుల్లో గౌరీ లంకేశ్ మృతి చెందింది.ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ( సిట్ ) జనవరిలో నవీన్ కుమార్‌ను అరెస్ట్ చేసింది.

అక్రమ ఆయుధాల కేసులో నవీన్ కుమార్‌‌ను బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి విచారించగా.. నిందితుడికి గౌరీ లంకేశ్ హత్య కేసులో ప్రమేయమున్నట్లు వెల్లడైంది. గౌరీ లంకేశ్ హత్యలో తన ప్రమేయాన్ని నవీన్ వివరించగా.. దానికి సంబంధించిన సీల్డ్ కాపీని మేజిస్ట్రేట్‌కి అందజేశారు. దీంతో.. మరో ఎనిమిది రోజుల పాటు సిట్ కస్టడీకి నవీన్ కుమార్‌ని కోర్టు అప్పగించింది. తాను గౌరిని చంపినట్లు నవీన్ తమకు చెప్పాడని అతని స్నేహితులు కొందరికి వెల్లడించడంతో డొంక కదలింది.