బీఎస్ఈలో జీహెచ్ఎంసీ బాండ్లు… ట్రేడింగ్ చేసిన కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

బీఎస్ఈలో జీహెచ్ఎంసీ బాండ్లు… ట్రేడింగ్ చేసిన కేటీఆర్

February 22, 2018

రూ. 1000 కోట్లను 8.9 శాతం వడ్డీ రేటుపై సేకరించాలన్నది జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుని మున్సిపల్ బాండ్లను విక్రయిస్తోంది. ముంబై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ) బాండ్లు ఈ ఉదయం నుంచి లిస్టింగ్ అయ్యాయి. తెలంగాణ ఐటీ, మునిసిపల్ శాఖల మంత్రి కేటీఆర్ తొలి ట్రేడింగ్ చేసి, లావాదేవీలను లాంఛనంగా ప్రారంభించారు.

బాంబే స్టాక్ ఎక్చేంజ్‌లో మున్సిపల్ బాండ్ల నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి  ఎస్ కే జోషి, ఎమ్ఏయూడి ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, రామకృష్ణారావు ప్రిన్సిపల్ సెక్రెటరీ ఫైనాన్స్ మరియు మేయర్లు బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, జీహెచ్ఎంసీ కమీషనర్ జనార్ధన్ రెడ్డి,  ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ మేయర్లు ప్రారంభించారు.

బాండ్లను విక్రయించడం ద్వారా బల్దియా రూ.200 కోట్ల నిధులను గతంలో సేకరించిన విషయం తెలిసిందే. మరో 800 కోట్లు వచ్చే ఆర్దిక సంవత్సరం సేకరించనున్న జీహెచ్ఎంసీ, దేశంలో మొదటి సారిగా పుణే తరువాత బాండ్ల ఇష్యూ ద్వారా 200 కోట్లు  నిధులు సేకరించింది.ఎస్ఆర్డీపీ ( స్ట్రయిట్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ ) లో భాగంగా ఈ నిధుల సమీకరణ జరిగింది. ఆర్దిక స్వయంసమృద్ధిలో జీహెచ్ఎంసీకి కేర్ ఇండియా రేటింగ్ సంస్థ AA రేటింగ్ ఇవ్వడంతో బాండ్ల ఇష్యూకి  సులభతరం అయింది.