పండ్ల టీలు ఎక్కువైతే పళ్లు పుచ్చులే... - MicTv.in - Telugu News
mictv telugu

పండ్ల టీలు ఎక్కువైతే పళ్లు పుచ్చులే…

February 23, 2018

చాలా మంది అలసటగా ఉందని, పనిలో ఒత్తిడి నుంచి ఉపశమం పొందడానికి కాఫీ, టీలు తాగుతుంటారు. టీలో నిమ్మరసం, నారింజ రసం వంటి పళ్ల రసానలను కూడా కలుపుని సేవిస్తుంటారు. కానీ ప్రూట్స్ టీ  తాగడం దంతాలకు మంచిది కాదని తాజా పరిశోధనల్లో తేలింది. ఫ్రూట్ టీలలో ఉండే యాసిడ్.. దంతాలపై ఉండే ఎనామిల్‌ను కోల్పోతుందని, అలాగే దంతాల మధ్య దూరం ఏర్పడే అవకాశాలు చాలా ఉన్నాయని దంతవైద్యులు హెచ్చరిస్తున్నారు. వేడినీళ్లలో నిమ్మరసం తీసుకున్నా ప్రమాదమేనని పేర్కొన్నారు.రోజుకు రెండుసార్లు ఫ్రూట్‌ టీ తీసుకునేవారికి దంత సమస్యలు 11 రెట్లు అధికమని లండన్‌ డెంటల్‌ ఇనిస్టిట్యూట్‌ హెచ్చరించింది. పండ్లలో సహజంగా ఉండే యాసిడ్స్‌ వేడినీటిలో మరగబెట్టినప్పుడు అవి దంతాలకు కీడు చేస్తాయని తెలిపింది. రోజూ లెమన్‌, జింజర్‌ టీ సేవించే 300 మందిని తాము పరిశీలించామని, టీలను వేడిచేసే క్రమంలో పండ్లలో ఉండే రసాయనాలు దంతాలపై మరింత ప్రభావం చూపడంతో దంతాలు దెబ్బతిన్నట్టు వెల్లడైందని అధ్యయనం చేపట్టిన డాక్టర్‌ సరోస్‌ ఓటూల్‌ పేర్కొన్నారు.