గ్రూప్-1 ఫలితాలు రద్దు - MicTv.in - Telugu News
mictv telugu

గ్రూప్-1 ఫలితాలు రద్దు

October 31, 2017

రెండు రోజుల క్రింద ప్రకటించిన గ్రూప్ -1 ఫలితాలను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. ఫలితాల్లో పొరపాట్లు దొర్లడమే దీనికి కారణం. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లకు సంబంధించిన సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపాలతో పోస్టుల ప్రాధాన్యతా క్రమం అస్తవ్యస్తంగా మారింది.

ఫలితాల అనంతరం అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు రావడంతో టీఎస్‌పీఎస్సీ తప్పులను దిద్దుకునేందుకు చర్యలు చేపట్టింది. వెబ్‌ఆప్షన్లలోనే పొరపాట్లు ఉన్నందున అభ్యర్థులు ఇచ్చిన కాపీలను, సీజీజీ వెబ్‌ఆప్షన్లతో పూర్తిగా ఒకొక్కటీ తనిఖీ చేయనుంది. ఆ మేరకు తుది వెబ్‌ఆప్షన్ల జాబితాతో సవరణ జాబితాను ప్రకటించనుంది. సరైన వెబ్‌ఆప్షన్లు తీసుకుని సవరణ జాబితాను ప్రకటించనుండటంతో కొందరి పోస్టులు మారనున్నాయి.