టాలీవుడ్ అగ్ర నిర్మాత భారీ మోసం..  జీఎస్టీ కేసు నమోదు - MicTv.in - Telugu News
mictv telugu

టాలీవుడ్ అగ్ర నిర్మాత భారీ మోసం..  జీఎస్టీ కేసు నమోదు

February 22, 2018

దక్షిణ భారతదేశంలో సినీరంగంలో జీఎస్టీ ఎగవేతపై తొలి కేసు నమోదైంది. ఓ ప్రముఖ తెలుగు సినీ నిర్మాతపై జీఎస్టీ కమిషనర్ కార్యాలయం అధికారుల కేసు నమోదు చేశారు. సినిమా నిర్మాణ సమయంలో పలు విభాగాల నుంచి జీఎస్టీ కింద రూ.7 కోట్లు వసూలు చేసిన సదరు నిర్మాత, ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి మాత్రం జమ చేయలేదు.

దీంతో, ఆయనపై కేసు నమోదు చేశారు. ఆ నిర్మాత కార్యాలయాలపై బుధవారం కేంద్ర జీఎస్టీ అధికారులు నిన్న దాడులు నిర్వహించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.  తాను పన్ను ఎగ్గొట్టినట్టు అతడు ఒప్పుకున్నాడు.


వసూలు చేసిన పన్నును ప్రభుత్వానికి చెల్లించకపోవడం జీఎస్టీ చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని అధికారులు పేర్కొన్నారు.ఈ చట్టం కింద ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చునని, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు చెల్లించాల్సిన మొత్తానికి వంద శాతం జరిమానా విధిస్తామని తెలిపారు. కాగా సదరు నిర్మాత నిన్న రూ. 2 కోట్లు చెల్లించారని, మిగిలిన రూ. 5 కోట్లు చెల్లించేందుకు వారం రోజుల గడువు కావాలని ఆ నిర్మాత కోరినట్టు తెలిపారు.