mictv telugu

పెళ్లి భోజనం రుచిగా లేదని తన్నుకున్నారు.. వీడియో

February 12, 2019

పెళ్లి భోజనానికి ఉన్న రుచే వేరు. అందుకే పెళ్లిలో ఎగబడి భోజనం చేస్తారు అతిధులు. అదే పెళ్లి భోజనం విషయంలో ఏదైనా తేడా జరిగితే.. రచ్చ జరగాల్సిందే. ఇవి కేవలం చిన్న చిన్న పెళ్లిలకే కాదు. సంపన్నుల హైప్రొఫైల్ పెళ్లిళ్లలో కూడా చోటుచేసుకుంటాయి.

ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ పెళ్ళిలో విందు భోజనం రుచిగా లేదని హోటల్ సిబ్బందిని చితకబాదారు అతిధులు. ఆపై హోటల్‌లో లక్షల రూపాయల విలువైన సామగ్రిని పగులకొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

మగపెళ్లివారు, ఆడపెళ్ళివారు కొట్టుకుంటున్న వీడియోలు, తదనంతరం హోటల్ సిబ్బందితో గొడవపడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆ హోటల్లో వివాహానికి 500 మంది అతిధులు హాజరయ్యారు.Telugu News guest fighting with hotel staff at a wedding ceremony in Delhi, videos goes viral