స్కూల్ పిల్లల కోసం గైడ్ లైన్స్ ! - MicTv.in - Telugu News
mictv telugu

స్కూల్ పిల్లల కోసం గైడ్ లైన్స్ !

September 13, 2017

సుప్రీంకోర్ట్ స్కూల్ పిల్లల కోసం ‘ గైడ్ లైన్స్ ’ తప్పినిసరిగా వుండాలని తీర్పిచ్చింది. ఈ మధ్య వరుసగా స్కూలు పిల్లల మీద జరుగుతున్న భౌతికదాడుల రిత్యా ఈ నిర్ణయం తీస్కున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ గైడ్ లైన్స్ లో భాగంగా ప్రతీ స్కూల్లో సిసి టీవి కెమెరాలు తప్పినిసరిగా బిగించాలట. అలాగే స్కూల్ యొక్క సేఫ్టీ కమిటీ కూడా వుండాలట. స్కూళ్ళల్లో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ చికిత్స వుండాలట. 1 నుండి 8 తరగతి చదువుతున్న విద్యార్థినులకు టాయిలెట్ వరకు తీసుకు వెళ్ళడానికి ఒక ఆయా ఖచ్చితంగా వుండాలని ప్రకటించింది. సమాజంలో జరుగుతున్న దారుణాలకు విరుగుడుగా ఈ గైడ్ లైన్స్ పని చేస్తుందని విద్యా సంస్థలు భావిస్తున్నాయి.