నల్లధనంలో నంబర్ వన్ గుజరాత్... - MicTv.in - Telugu News
mictv telugu

నల్లధనంలో నంబర్ వన్ గుజరాత్…

October 3, 2018

గుజరాత్ అంటే వ్యాపారానికి పెట్టింది పేరు. అక్కడ ఏ వ్యాపారం పెట్టినా మూడు పువ్వులు ఆరు కాయలుగా లాభాల బాటలో నడుస్తుందని నమ్ముతారు. అయితే అక్కడ వ్యాపారానికి సమవుజ్జీగా మోసాలు కూడా జరుగుతున్నాయి. బ్యాంకులకు 19 వేల కోట్లు ఎగ్గొట్టిన గుజరాతీ నీరవ్ మోదీ, 6 వేల కోట్లు ఎగ్గొట్టిన నితిన్  సందేసర కేసులు అందుకు ఉదాహరణగా నిలిచాయి. తాజాగా గుజరాతీల దగ్గర భారీగా నల్లధనం వున్నట్లు స్వయంగా ఆదాయపు పన్ను(ఐటీ) శాకే తెలిపింది. 2016 జూన్సెప్టెంబర్ నెలల్లో ఆ రాష్ట్రంలో రూ.65,250 కోట్ల నల్ల నగదు బయటపడిందని తెలిపింది. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు కేంద్రం ప్రకటించే స్వచ్ఛంద ఆదాయ వెల్లడి (ఐడీఎస్) పథకం కింద ఈ నగదు బయటపడింది.

Gujarat No 1 in black money according to voluntarily disclose assets scheme announced by Modi Government 29 percent of block money

మొత్తం నల్లధనంలో గుజరాతీల వాటా 29 శాతంగా ఉందని ఐటీ శాఖ తెలిపింది. గుజరాతీ లు రూ.18,000 కోట్లు ప్రకటించారని పేర్కొంది. ఐడీఎస్ కింద ప్రకటించిన ఆస్తుల వివరాలను తెలపాలంటూ 2016, డిసెంబర్ 21 భరత్ సిన్హా జాలా అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశాడు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి షా రూ.13,860 కోట్లతో జాబితాలో టాప్‌లో నిలిచినట్లు ఐటీ శాఖ తెలిపింది. కాగా, అక్రమ సంపాదన, నల్లధనానికి సంబంధించి పోలీసులు, ఉన్నతాధికారుల వివరాలను మాత్రం ఐటీ శాఖ బయటపెట్టకపోవడం గమనార్హం.