కుక్క జోస్యం.. బీజేపీ సంబురం - MicTv.in - Telugu News
mictv telugu

కుక్క జోస్యం.. బీజేపీ సంబురం

December 15, 2017

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్  రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో  బీజేపీనే విజయం సాధిస్తుందని చెబుతున్నాయి ఎగ్జిట్ పోల్స్. సోమవారం గుజరాత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేఫథ్యంలో బీజేపీ నేత అమిత్ మాల్వియా తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశాడు. ప్రస్తుతం  ఆ వీడియో అందర్నీ ఆకర్షిస్తోంది.

 వీడియోలో ఓ యువతి చిన్న కుక్కపిల్లని ఎత్తుకుని ‘మోదీ వస్తున్నారా’ అని అడుగుతుంది. దానికి సమాధానంగా ఆ కుక్కపిల్ల దాని ముందు కాళ్లను ఊపుతుంది. మళ్లీ  ‘ రాహుల్ వస్తున్నారా’ అడిగితే మాత్రం ఏమీ స్పందించడం లేదు. కాంగ్రెస్ వస్తుందా అని అడిగినా మౌనంగా ఉంటోంది.

ఈ వీడియోను  అమిత్ ట్విటర్‌లో పోస్టు చేస్తూ.. ‘ ఈ క్యూట్ కుక్కపిల్లకి అన్నీ తెలుసు’ అని ట్యాగ్ చేశాడు. ఓట్ల లెక్కింపుకు ముందు ఈ వీడియోను పోస్టు చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఖరికి ఆ మూగజీవి కూడా మోదీని సపోర్టు చేస్తోందని నెటిజన్లు ట్విటర్ ద్వారా కామెంట్లు చేస్తున్నారు.