ఒంటిపై అరకేేజీ బంగారం.. 10 పోలీసు కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

ఒంటిపై అరకేేజీ బంగారం.. 10 పోలీసు కేసులు

December 5, 2017

గుజరాత్‌లోని దరియాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుంజల్ పటేల్‌కు బంగారు ఆభరణాలు అంటే అమితమైన ఇష్టం. ఆయన తన అఫిడవిట్‌లో తన దగ్గర 45 తులాల బంగారం ఉందని రిట్నరింగ్ అధికారులకు తెలియజేశాడు. ఇంకా తన ఇంట్లో 115 తులాల బంగారం ఉందని కూడా  పేర్కొన్నాడు. తన బ్యాంకు ఖాతాలో రూ.  24,500 ఉన్నాయని, తన మెుత్తం ఆస్తి విలువ రూ. 5 కోట్లు అని చూపించాడు.

తనకు రెండు కార్లు ఉన్నాయని, అలాగే తనపైన 10 పోలీసు కేసులు కూడా ఉన్నాయని చెప్పాడు. అతడు ఏడవ తరగతి ఉత్తీర్ణడైయ్యాడు. ప్రైవేట్ ఉద్యోగ్యం ద్వారా సంపాదిస్తున్నట్టుగా అఫిడవిట్‌ను ఎన్నికల అధికారులకు సమర్పించాడు.  తనకు 45 తులాల బంగారం ఉందని, అయితే 50 తులాల బంగారం ధరిస్తానని చెప్పాడు. ఈ తేడా ఏంటి అని విలేకర్లు అడగ్గా.. ఆ ఎక్కువున్న 5 తులాల బంగారాన్ని తన అత్తింటివారు ఇచ్చారన్నారు.  అత్తింటి వారు ఇచ్చిన  ఆస్తిపాస్తులను  అఫిడవిట్‌లో తెలియజేయనవసరం లేదని కుంజల్ తెలిపాడు.