మాకు 150 సీట్లు ఎందుకు రాలేదంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

మాకు 150 సీట్లు ఎందుకు రాలేదంటే..

December 19, 2017

గుజరాత్ ఎన్నికల్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకుగాను   150  స్థానాల్లో గెలిచి తీరతామని  బీజేపీ ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు మందు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఈ విషయాన్ని ఢంకా బజాయించి చెప్పారు.  కానీ ఎన్నికల్లో ఆ పార్టీ 99 స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. ప్రధాని మోదీ స్వయంగా సుడిగాలి ప్రచారం చేసినా, తమను ఓడగొట్టడానికి పాక్, కాంగ్రెస్ చేతులు కలిపాయని తీవ్ర ఆరోపణలు చేసినా.. ఈ స్వల్ప మెజారిటీతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లు రాకపోవడానికి గల కారణాలు ఏమిటని  అమిత్ షాను  మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ..  ‘కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలు చేసింది. ప్రజల మధ్య చిచ్చుపెట్టింది.  అందుకే మాకు ఓట్లు తగ్గాయి.  ప్రజలను కాంగ్రెస్ నేతలు రెచ్చగొట్టారు. వారి ప్రచార స్థాయి దిగజారింది. అందువల్లే ఓట్లు చీలిపోయాయి .  చాలా చోట్ల అనుకున్న ఓట్లను పొందడంలో విఫలమయ్యాం..  కాంగ్రెస్ ప్రచార విలువలను మరచి ఇంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని అనుకోలేదు. అయినా కూడా  ఆ పార్టీ మాకు పోటీ ఇవ్వలేకపోయింది’ అని చెప్పారు.