గుజరాత్‌లో కుదిరిన పొత్తు..హార్ధిక్ పటేల్ కాంగ్రెస్‌తోనే - MicTv.in - Telugu News
mictv telugu

గుజరాత్‌లో కుదిరిన పొత్తు..హార్ధిక్ పటేల్ కాంగ్రెస్‌తోనే

November 22, 2017

గుజరాత్ ఎన్నికల్లో తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకే అని పాటిదార్ రిజర్వేషన్లకోసం కొట్లాడుతున్న  హార్ధిక్ పటేల్ ప్రకటించాడు. కాంగ్రెస్ పార్టీ.. తమ వారికి ప్రత్యేక కేటగిరీ కింద రిజర్వేషన్లు ఇవ్వడానికి అంగీకరించినట్టు ఆయన ప్రకటించారు.

ఈసందర్భంగా హార్ధిక్ మాట్లాడుతూ ‘ గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నాడు. ఆ తర్వాత అసెంబ్లీలో రిజర్షేన్లకు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీ పాటిదార్ల డిమాండ్లను  తమ మేనిఫెస్టోలో పెట్టడానికి అంగీకరించిదని  తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాటిదార్ల రిజర్వేషన్ల కోసం ఓ కమీషన్‌ను ఏర్పాటు చేసి, ఆతర్వాత సర్వే  నిర్వహించే విధంగా చర్చలు జరిగినట్టు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీతో సీట్ల పంపిణీ గురించి ఎలాంటి చర్చలు జరగలేదని అన్నారు. పాటిదార్లను మభ్య పెట్టడానికి, తమలో అనైక్యతను సృష్టించడానికి  బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుందని హార్థిక్ మండిపడ్డారు. గుజరాత్‌లో  డిసెంబర్ 9 &14 న ఎలక్షన్లు  జరుగుతున్న సంగతి తెలిసిందే.