లెక్కింపు శురువైంది...గెలుపెవరిది? - MicTv.in - Telugu News
mictv telugu

లెక్కింపు శురువైంది…గెలుపెవరిది?

December 18, 2017

ఈరోజు (సోమవారం)  ఉదయం 8 గంటలనుండే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది. ఓ వైపు మోదీ స్వంత రాష్ట్రం కావడంతో.. మరోవైపు ఈమధ్యే అధ్యక్ష కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీ… కాబట్టి ఈఫలితాలు  అందరిలోనూ చాలా ఉత్కంఠను రేపబోతున్నాయి. ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ గెలిచి మళ్లీ తమ సత్తా ఏంటో నిరూపించుకుంటుందా? లేదా ఎప్పటినుంచో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ గెలిస్తుందా? అందరిలోను ఉత్కంఠ. ఎగ్జిట్ పోల్ చెప్పినట్టే జరుగబోతుందా? ఇవన్ని ప్రశ్నలకు మరికొన్ని గంటల్లో సమాధానం దొరకబోతుంది. ఇప్పటివరకు జరిగిన లెక్కింపులో ఇటు గుజరాత్‌లో,అటు హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ ముందజలో ఉంది. గుజరాత్‌లో 182 స్థానాలకు గాను 18,28 మంది పోటీ చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ 68 స్థానాలకు గాను 337 మంది పోటీ చేశారు.  గుజరాత్ లో అధికారంలోకి రావాలంటే 92 స్థానాల్లో, హిమాచల్ ప్రదేశ్ లో35 స్థానాల్లో గెలుపు తప్పనిసరి.