అమిత్ షా హిందువు కాదు.. - MicTv.in - Telugu News
mictv telugu

అమిత్ షా హిందువు కాదు..

December 1, 2017

గుజరాత్ ఎన్నికల సందర్బంగా రాజకీయ నాయకుల మధ్య  ‘ హిందూ ’ వివాదం రోజు రోజుకు  ముదురి పాకాన పడుతోంది. రాహుల్ గాంధీ  హిందువు కాదని బీజేపీ ఆరోపించిన విషయం తెలిసిందే. దానికి నరేంద్ర మోదీ కూడా హిందువు కాదని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. ఈ విషయమై ఇరు రాజకీయ పార్టీల నడుమ పెద్ద దూమారానికి దారి తీస్తున్నది.

కాగా ఇప్పుడు కాంగ్రెస్ మరో అడుగు ముందుకేసి అమిత్‌షాను టార్గెట్ చేసింది. అమిత్‌షా హిందువు కాదని , అతను జైనుడని కాంగ్రెస్ నేత  రాజ్ బబ్బర్ ఆరోపించారు.‘ అమిత్ షా హిందువునని చెప్పుకుంటాడు కానీ ఆయన జైన మతానికి చెందినవాడు. మోడీ అనుసరించేది హిందూత్వమని, హిందూయిజానికి .. హిందూత్వంకు చాలా వ్యత్యాసం ఉందని ’ రాజ్ బబ్బర్ ఘాటుగా విమర్శించారు.