గిర్ అడవుల్లో విషాదం… 21 సింహాలను మింగిన వైరస్ - MicTv.in - Telugu News
mictv telugu

గిర్ అడవుల్లో విషాదం… 21 సింహాలను మింగిన వైరస్

October 3, 2018

గుజరాత్‌లోని గిర్ అడవిలో  గత 18 రోజుల నుంచి 21 సింహాలు మరణించాయి. అందుకు కారణం గుర్తుతెలియని వైరస్, ఇన్‌ఫెక్షన్‌తో అవి మృతి చెందాయని గుర్తించారు అధికారులు. వాటిలో 6 సింహాలు ప్రొటోజోవా ఇన్‌ఫెక్షన్‌తో మరణించినట్టు అధికారులు తెలిపారు. పురుగుల ద్వారా ఈ ఇన్‌ఫెక్షన్ వ్యాపిస్తోందని నిర్ధారించిన అధికారులు, దల్ఖానియా రేంజ్ ప్రాంతంలో ఇన్‌ఫెక్షన్ ప్రభావం అధికంగా ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.

పలు సింహాలు అనారోగ్యంతో ఉన్నాయని గుర్తించామని, వాటిని రెస్క్యూ కేంద్రానికి తరలించి చికిత్సను అందిస్తున్నామని తెలిపారు.

21 Lion deaths in 18 days at Gir, forest department confirms

మరణించిన సింహాల కళేబరాల్లో తమకు కనిపించిన వైరస్ ఏంటన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని వైద్యులు తెలిపారు. మిగతా సింహాలకు వైరస్ సోకకుండా యూఎస్ నుంచి వాక్సిన్‌ను తెప్పిస్తున్నామని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. 2015 లెక్కల ప్రకారం గిర్ అడవుల్లో 520 సింహాలు ఉన్నాయి.