మేత మేస్తూ 56 ఆవుల మృతి - MicTv.in - Telugu News
mictv telugu

మేత మేస్తూ 56 ఆవుల మృతి

April 9, 2018

మూగ జీవాలు ఒక్కసారి  కుప్పకూలి విగతజీవులయ్యాయి. ఒక్కసారి 56 ఆవులు మేత మేస్తూనే మరణించాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా గురజాల మండలం దైదాలో విషాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా నేరేడుచర్లకు చెందిన ఓ రైతు మేత కోసమంటూ 100 ఆవుల మందను గురజాలకు తీసుకువచ్చాడు. ఆవులు  పొలంలో మొక్కజొన్న పంట తీశాక వచ్చిన పిలకలను తిని అస్వస్థతకు గురయ్యాయి.

56 ఆవులు ఘటనా స్థలంలోనే మృతి చెందాయి. మిగతావి అస్వస్థతకు గురయ్యాయి. అవి ఎందుకు మరణించాయో స్పష్టమైన  కారణం తెలియాల్సి ఉంది. గతంలో మొక్కజొన్న పంటపై జల్లిన పురుగుల మందు అవశేషాలు ఆవుల మృతికి కారణమా? లేక మొక్కజొన్న పిలకల తినడం వల్ల మృతిచెందాయా? అనే కోణం నుంచి పశు సంవర్థకశాఖ అధికారులు  పరిశీలిస్తున్నారు. ఉన్నట్టుంటి ఆవులు 56 చనిపోవడంతో 10లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని ఆవుల యాజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.