వీడియో గేమ్ పిచ్చి..  ఏమైందో చూడండి .. - MicTv.in - Telugu News
mictv telugu

వీడియో గేమ్ పిచ్చి..  ఏమైందో చూడండి ..

February 2, 2018

ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే  పడతారన్నట్లు…ఫోన్లపై పిచ్చితో కొందరు ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇంకొందరైతే ఏకంగా ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. చైనాలో ఓ వ్యక్తి  ఓ ఇంటర్‌నెట్‌ కేఫ్‌లోకి వెళ్లి  దాదాపు 20 గంటలు  గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాడు.

బాత్రూంకి వెళదామని  లేవబోతే  అప్పుడు అర్థమైంది అతనికి.. ఎక్కువగా ఫోన్లల్ల మునిగిపోతే ఏమైతదో అని.  కూర్చున్న చోటే  పక్షవాతం వచ్చింది.  కదలకుండా 20 గంటలు కూర్చుండడంతో  కుర్చీలోనే కాళ్లు చచ్చు బడిపోయాయి. వెంటనే  కేఫ్ సిబ్బంది  ఆంబులెన్స్‌కు  ఫోన్ చేశారు.

ఆసుపత్రి సిబ్బంది వచ్చి  వెంటనే అతనిని  స్ట్రెచర్‌పై  తీసుకెళ్లారు.  ఇతనే కాదు  ఇంతకు మందుకూడా  ఇదే చైనాలో ఓ అమ్మాయి 24 గంటలు ఫోన్ లో  వీడియో గేమ్ ఆడి  తన కంటి చూపు కోల్పోయింది.  ఈరోజుల్లో చిన్న పిల్లలే కాదు  పెద్ద వాళ్లు సైతం  ఫోన్లలో వీడియో గేమ్‌ల పిచ్చిలో మునిగి పోతున్నారు.

స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్’లు  వచ్చిన దగ్గర నుంచి ఈ పిచ్చి మరింత ఎక్కువగా మారింది.  ఫోన్లు లేని కాలంలో  ఆటలాడితే  శరీరానికి మంచి వ్యాయామం అయ్యేది  కానీ ఇప్పుడాడుతున్న ఆటలతో ఏకంగా  ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. ఇంతకు ముందు చూడలేదా బ్లూవేల్ గేమ్ అని  ఎంతో మంది  ప్రాణాలు పోగొట్టుకున్నారు.   ఏమి ఫోన్లో  ఏమి ఆటలో… మీలో కూడా ఎవరైనా  ఇలా ఫోన్లకు బానిసలైతే ..  జాగ్రత్త  అది మీ ప్రాణాలకే ముప్పు కావచ్చు. ఆ తర్వాత మీఇష్టం.