మరో ముప్పు.. 1.13 లక్షల ఏటీఎంల మూసివేత - MicTv.in - Telugu News
mictv telugu

మరో ముప్పు.. 1.13 లక్షల ఏటీఎంల మూసివేత

November 21, 2018

పెద్దనోట్ల రద్దు తర్వాత జనం ఎంత నరకం అనుభవించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నగదు కోసం బ్యాంకుల చుట్టూ, ఏటీఎంల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారు. ముసలీముతకా క్యూలలో ఎండకు ఎండారు. 200 మందికిపైగా చనిపోయారు. అంతకు మించిన ముప్పు మరొకటి పొంచి ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలోని ఏటీఎంలలో సగం మూతపడబోతున్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ(క్యాట్‌మీ) హెచ్చరించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎంలను ఎత్తేస్తారని బాంబు పేల్చింది.

Telugu news Half of India's ATMs May Close Down by March 2019, Warns Industry Body  catmi Closure of the ATMs will impact thousands of jobs and also the financial inclusion efforts of the government..

దేశంలోని మొత్తం 2.38 లక్షల ఏటీఎంలో సగం మూతపడున్నాయి. వీటిలో లక్ష ఏటీఎంలు ఆఫ్‌ సైట్(బ్యాంకు ఆవరణల్లో లేని)  ఏటీఎంలు కాగా, మిగతావి ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలు నిర్వహిస్తున్నవి.. నిర్వహణపరమైన మార్పుల వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. సర్వీర్ ప్రొవైడర్లు భారీ ఖర్చును భరించే స్థితిలో లేరు. సాఫ్ట్ వేర్ అప్‌గ్రేడ్, క్యాష్ మేనేజిమెంట్ షరతులు, నగదు లోడ్ చేయడానికి వాడాల్సిన ఖరీదైన క్యాసెట్ స్వాపింగ్ విధానం తదితర మార్పుచేర్పుల ఫలితంగా ఏటీఎంలు మూతపడనున్నాయి..’ అని ఓ ప్రకటనలో తెలిపింది. మూసివేత ఫలితంగా  గ్రామీణులు నానా ఇబ్బందులు పడతారని, వేల మంది ఉద్యోగాలు కోల్పోతారని క్యాట్‌మీ ఆందోళన వ్యక్తం చేసింది. గ్యాస్ సబ్సిడీ, ఇతర సంక్షేమ పథకాల రాయితీలను విత్ డ్రా చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొంది.

Telugu news Half of India’s ATMs May Close Down by March 2019, Warns Industry Body  catmi Closure of the ATMs will impact thousands of jobs and also the financial inclusion efforts of the government.