మరుగుజ్జుల గ్రామం.. దుష్టశక్తులు, విషవాయువులు - MicTv.in - Telugu News
mictv telugu

మరుగుజ్జుల గ్రామం.. దుష్టశక్తులు, విషవాయువులు

February 15, 2018

మనుషుల్లో ఏ కొంత మందో మరుగుజ్జులుగా వుండటం చూశాం గానీ  ఊరికి ఊరంతా మరుగుజ్జులుగా వుండటం చూశామా ? లేదు కదా.. అలాంటి ఒక వూరు చైనాలో వుంది. ఆ గ్రామం పేరు యాంగ్సీ. ఈ గ్రామంలో చాలా మంది మరుగుజ్జులే వున్నారు.  ఇక్కడి జనాభా ఇలా ఉండటాన్ని మొదటిసారిగా 1951లో గుర్తించారు. ఇక్కడున్న జనాభాలో సగానికిమించి మరగుజ్జులే ఉన్నారు. దీన్ని చాలా మంది ఈ గ్రామాన్ని మరుగుజ్జు గ్రామంగా పిలుస్తుంటారు. వీరి సగటున ఎత్తు 2 నుంచి 4 అడుగులే వుంటుంది. ఈ గ్రామంలో ఎందుకిలా మరుగుజ్జులు వుంటున్నారనే దాని మీద పరిశోధనలు జరుగుతున్నాయి.ఎత్తుపెరగలేదన్న దిగులుతో గ్రామాన్నివిడిచిపెట్టి వెళ్లిపోవడం ప్రారంభించారు. ‘మేం మరుగుజ్జులుగా పుట్టిందే చాలు.. మా పిల్లలు కూడా అలాగే పుట్టడం మాకిష్టం లేదు..’ అని  ఆ గ్రామస్తులు గ్రామం విడిచి వెళ్లిపోతున్నారట. ఈ వూళ్ళో ఏవో దుష్టశక్తులు వుండటం వల్లే ఈ వూరి మనుషులు ఇలా మరుగుజ్జులుగా తయారవుతున్నారని ఆందోళన చెందుతున్నారు. గతంలో జపాన్… చైనాపై విషవాయువులు ప్రయోగించిన కారణంగా గ్రామంలో ఇలా జరుగుతోందని కొందరు అంటున్నారు.