సగం సంపద దానానికి: నీలేకని - MicTv.in - Telugu News
mictv telugu

సగం సంపద దానానికి: నీలేకని

November 21, 2017

‘ మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిద్దాం.. దాన్నుంచి ఫలితాన్ని ఆశించకుండా.. ’ అన్న భగవద్గీత సూక్తిని ఓ సంపన్న దంపతులు పాటించి తమ సంపదలో సగభాగాన్ని ధాతృత్వానికి కేటాయించారు. . ఇన్పోసిస్‌ సహ వ్యవస్థాపకులు నందన్‌ నీలేకని, ఆయన భార్య రోహిణి నీలేకని తాము సంపాదించుకున్నదాంట్లోంచి సగభాగాన్ని ధాతృత్వ కార్యక్రమాలకు వెచ్చించనున్నారు. ఇందుకు ప్రపంచ సంపన్నులు నెలకొల్పిన ‘ ది గివింగ్ ప్లెడ్జ్ ’ వేదిక అయ్యింది. నీలేకని అంగీకారంతో రాసిన లేఖను ది గివింగ్‌ ప్లెడ్జ్‌ వెబ్‌సైట్‌ అప్‌లోడ్‌ చేసింది.‘ భగవద్గీత నుండి పొందిన ప్రేరణతో బిల్ అండ్ మిలిండా గేట్స్ ఈ అరుదైన అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రత్యక్షంగా ప్రతిస్పందన లభించదనే భావనతో, చేసే మంచి పనిని చెయ్యకుండా ఆగిపోవద్దు.. ’ అని వివరించారు. నీలేకని దంపతులను సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు బిల్‌గేట్స్ ట్వీట్ చేయటం విశేషం. ఈ పథకంలో భారత్‌కు చెందిన బయోకాన్ ఛైర్మన్ కిరణ్ మజుందార్ షా, విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, భోభా డెవలపర్స్ గౌరవ ఛైర్మన్ పీఎన్‌సీ మేనన్ తదితరులు ఇప్పటికే భాగస్వాములయ్యారు.