ఆ హీరోయిన్లకు బాగా ముడుతుంది - MicTv.in - Telugu News
mictv telugu

ఆ హీరోయిన్లకు బాగా ముడుతుంది

October 27, 2017

తెలుగు సినిమాలపై తాప్సీ విమర్శలు కాస్త సద్దుమణుగుతుండగా, బాలీవుడ్ బుల్లితెర నటి హీనాఖాన్ తన వంతుగా ముందుకొచ్చారు. దక్షిణాది   హీరోయిన్ల గురించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘యే రిష్తా క్యా కెహలత్’ హిందీ సిరియల్ ద్వారా పాపులర్ అయిన ఆమె హిందీ ‘బిగ్ బాస్’ సీజన్ 11 పార్టీసిపెంట్‌గా ఉన్నారు. ‘బిగ్ బాస్ ’షోలో  ఓ సందర్బంలో దక్షణాది హీరోయిన్ల గురించి మాట్లాడారు.

దక్షిణాది హీరోయిన్లు బొద్దుగా ఉండి చీర కట్టి ఎక్స్ పోజింగ్ ఎక్కువగా చేస్తారని, ప్రేక్షకులు కూడా వారినే ఇష్టపడుతారని  ఆమె తిట్టారు. ‘నాకు కూడా గతంలో దక్షిణాదిలో హీరోయిన్‌గా  రెండుసార్లు అవకాశం వచ్చింది. కానీ బరువు పెరగాలని షరతు పెట్టారు. అందుకే అవి పెద్ద బ్యానర్ సినిమాలు అయినా వదులు కున్నాను.. అక్కడ హీరోయిన్లకు బాగానే డబ్బులు ముట్టచెబుతారు..’ అని చెప్పారు.  తనకు మహేశ్ బాబు, వేంకటేశ్ నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో  ఒక హీరోయిన్‌గా అవకాశం వచ్చిందని, అయితే మిస్సయ్యానని తెలిపింది. ఆ సినిమాను వదులుకున్నందుకు తనకు ఏ బాధాలేదని, తన జీవితంలో తనకు దక్కిన దానితో సంతోషంగా ఉన్నాని చెప్పింది.  దాదాపు 15 సంవత్సరాల తరువాత మహేశ్ బాబు, వెంకటేశ్ అభిమానులు కోట్టుకోకుండా ఉండటానికే వారు ఆ సినిమాలో కలిసి నటించారని హీనా తెలిపింది.

ఆమె వ్యాఖ్యలపై దుమారం రేగింది. నటి హన్సిక ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది చిత్ర పరిశ్రమను ఆమె తక్కువ చేసి మాట్లాడుతోందని మండిపడింది.  ‘చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు దక్షిణాదిన పనిచేశారు, చేస్తున్నారన్న విషయం ఆమెకు తెలియదా? మమల్ని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేసిన హీనా ఖాన్ సిగ్గుపడాలి.  నేను దక్షణాది నటిగా ఈ చిత్ర పరిశ్రమకు చెందిన నటినని చెప్పుకోవడం నాకు చాలా గర్వంగా  ఉంది.  హీనాఖాన్ చెప్పిన మాటలన్ని పనికిరానివే’ అని హన్సిక  వరుస ట్వీట్లు చేశారు.