పుత్లిబౌలీ నుంచి తాడ్‌బండ్ వరకు హనుమాన్ శోభాయాత్ర - MicTv.in - Telugu News
mictv telugu

పుత్లిబౌలీ నుంచి తాడ్‌బండ్ వరకు హనుమాన్ శోభాయాత్ర

March 31, 2018

హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలో అడుగడుగునా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా నగరమంతా పోలీసులు మోహరించి వున్నారు. పుత్లిబౌలిలోని రామమందిరం నుండి ఈ హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. అక్కడినుండి కోఠి, సుల్తాన్ బజార్ మీదుగా నారాయణగూడా నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ చిక్కడపల్లి చేరుకుంటుంది. అక్కడినుంచి కవాడిగూడా, బోయిగూడా నుంచి తాడ్‌బండ్ ఆంజనేయ స్వామి ఆలయం వరకు సాగుతుంది. అక్కడితో శోభాయాత్ర ముగుస్తుంది. ఈ శోభాయాత్రలో చాలా మంది హిందూ సోదరులు పాల్గొంటారు.కాగా హనుమాన్ జయంతి సందర్భంగా ప్రభుత్వం అనేక ఆంక్షలు పెడుతోందని బీజేపీ ఎమ్మెల్యే ఎన్‌విఎస్ఎస్. ప్రభాకర్ ఆరోపించారు. ర్యాలీని అడ్డుకోవటానికి పోలీసులు అనేక ఆంక్షలు పెడుతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం మజ్లిస్ కనుసన్నల్లో నడుస్తుంది అనటానికి ఇదే నిదర్శనం అన్నారు. మజ్లిస్ ఎజెండాను అమలు చేయటానికే పోలీసులు లేనిపోని ఆంక్షలు విధిస్తున్నారని పేర్కొన్నారు.