క్రీడా పాఠశాలల్లో కామాంధులు ! - MicTv.in - Telugu News
mictv telugu

క్రీడా పాఠశాలల్లో కామాంధులు !

February 9, 2018

వీళ్లందరూ హైద్రాబాద్‌లోని దోమల్ గూడలో ఉన్న ప్రభుత్వ క్రీడా పాఠశాల హాస్టల్ విద్యార్థులు. మరి వీరు ధర్నా చేస్తుంది మాకు సరిగా భోజనం పెట్టడంలేదనో, సరిగ్గా ఆటలు నేర్పించడంలేదనో,వసతులు సరిగాలేవనో కాదు..హాస్టల్లో అమ్మాయిలపై జరుగుతున్న అకృత్యాలు ప్రపంచానికి తెలియడానికి ధర్నా చేస్తున్నారు. హాస్టల్లలో కామాంధుల ఆగడాలను అరికట్టడానికి ధర్నా చేస్తున్నారు.  

5 రోజుల క్రితం కృష్ణవేణి అనే అమ్మాయి హాస్టల్ గదిలో ఉరివేసుకిన ఆత్మహత్య చేసుకుంది. హాస్టళ్లో అమ్మాయి చనిపోతే తమకేమి పట్టనట్టు ఉన్న వార్డెన్లు, సార్లు. అసలు ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది? కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల,గొడవల వల్లే చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆమె మరణం వెనక ఉన్న అసలైన కారణం ఏమిటి? నిజంగా కృష్ణవేణి కుటుంబ పరిస్థితుల వల్లే చనిపోయిందా? లేక హాస్టల్లో  అమ్మాయిపై జరిగే వికృత చేష్ఠలకు బలైపోయిందా?

అర్థనగ్నంగా ఉండి  ఇంటర్ చదివే చిన్న పిల్లల చేత మసాజ్ చేయించుకుంటున్న సార్లు. విద్యార్థులను భయపెట్టించుకుంటూ అజమాయిషీ చలాయిస్తూ…విద్యార్థులతో వంట పనులు చేయించే వార్డెన్లు.. చెప్పినట్టు వినే,తమ కోరిక తీర్చే అమ్మాయిలకే  ప్రాక్టికల్స్ లో మార్కులు వేసే సార్లు. ఇలా ఒక్కటా రెండా క్రీడా పాఠశాలలో జరుగుతున్న అఘాత్యాలు ఎన్నో. అందుకే విద్యార్థులపై జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్టవేయాలని…విద్యార్థుల ప్రయత్నం. వికృత చేష్టలను భరించి భరించి విసిగెత్తిపోయి…అందరూ కలిసి ఇలా ధర్నా చేస్తున్నారు. పాఠశాల, హాస్టల్లో జరుగుతున్న అక్కమాలపై ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు  కీచకులైన లైబ్రరీయన్ ను వెంటనే తొలగించాలి. లైబ్రరీలో సీసీ కెమెరాలు పెట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు.

కళాశాలలో కృష్ణవేణి ఆత్మహత్య, విద్యార్థులపై వేధింపులు, అనైతిక కార్యకలాపాలపై విచారణ నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జి.కిషన్. విచారణ సందర్భంగా కళాశాలలో పలు లోపాలు గుర్తించినట్లు చెప్పిన కమిషనర్ కిషన్ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.