అమలాపాల్‌కు లైంగిక వేధింపులు! - MicTv.in - Telugu News
mictv telugu

అమలాపాల్‌కు లైంగిక వేధింపులు!

January 31, 2018

నటి అమలాపాల్‌ పై  తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త అలగేశన్ అనే వ్యక్తి లైంగికంగా వేధించాడని తేలడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈఘటనపై అమలాపాల్ మాట్లాడుతూ ‘మహిళలకు సమాజంలో అస్సలు భద్రత లేకుండా పోతోంది.

కొందరు మాటలతో, మరికొందరు చేతలతో ఆడవాళ్లపై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. నటిగా ఉన్న నా పరిస్థితే ఇలాగ ఉంటే..ఇక సామాన్య మహిళల సంగతేంటి? ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’ అని అమలాపాల్ ఆవేదన వ్యక్తం చేసింది.