హర్భజన్, ఆఫ్రిది.. సూపర్ - MicTv.in - Telugu News
mictv telugu

హర్భజన్, ఆఫ్రిది.. సూపర్

October 27, 2017

క్రికెట్‌లో ఇండియా, పాకిస్తాన్ చిరకాల ప్రత్యర్థులు. రెండు జట్ల ఆటగాళ్లు  ఫీల్డ్‌లో ఉన్నప్పడు హోరాహోరీగా తలపడి ఆడతారు. కానీ బయట వారు స్నేహంగానే ఉంటారు. ఓ మంచి పని కోసం భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్, పాక్  మాజీ కెప్టన్ షాహిద్ ఆఫ్రిది‌తో చేతులు కలిపాడు.

హోప్ నాటౌట్ ’పేరుతో ఆఫ్రిది ఓ  పౌండేషన్‌ను 2014లో ప్రారంభించాడు. పాకిస్థాన్‌లో అణగారిక వర్గాల పిల్లల విద్య, వైద్యం , వాళ్లకు క్రిడా వసతులను కల్పించడం కోసం ఈ పౌండేషన్ స్థాపించాడు. దాని కోసం ఇప్పుడు హర్భజన్ కూడా ప్రచారం మెుదలుపెట్టారు. ఆఫ్రిదితో  కలసి ఈ  ఫౌండేషన్ కోసం ఇద్దరు విరాళాలు సేకరిస్తున్నారు.  పాక్‌లోని చాలా ప్రాంతాలలో ఆసుపత్రులు నిర్మించారు. అలాగే మంచినీటి కోసం బోరు బావులు వేయించారు.

ఇప్పుడు ఆఫ్రది, హర్భజన్  ఈ పౌండేషన్ కోసం కలిసి విరాళాలు సేకరిస్తున్న ఫోటోలను తమ ట్విటర్‌లో పోస్టు చేశారు. మంచి పనికోసం రెండు దేశాల క్రికెటర్ల కలసి కృషి చేయడం చాలా సంతోషంగా ఉందని రెండు దేశాల అభిమానులు అభినందిస్తున్నారు.