పెండ్లిరోజు నాడు కూడా...ఈ మంత్రిగారికి  పని ధ్యాసే... - MicTv.in - Telugu News
mictv telugu

పెండ్లిరోజు నాడు కూడా…ఈ మంత్రిగారికి  పని ధ్యాసే…

December 10, 2017

ఈరోజు  తెలంగాణ  ఇరిగేషన్ మంత్రి  హరీష్ రావ్  పెండ్లి రోజు. అయినా కూడా  ఆయన ఈరోజు  నాగార్జున సాగర్   వద్ద బీజీ బీజీగా గడిపారు.  నాగార్జున సాగర్ 63వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సాగర్ నుంచి ఎడమ కాలువకు నీటిని ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ ‘తమది అభివృద్ధి దాహమైతే.. కాంగ్రెస్‌ది అధికార దాహమన్నారు. యాసంగి కోసమే సాగర్ నుంచి ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. సాగర్ నుంచి 4 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వటమే తమ లక్ష్యమని మంత్రి తెలిపారు. సాగర్ వద్ద లిఫ్ట్‌లన్నీ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసుకున్నామని మంత్రి తెలిపారు.

కాంగ్రెస్ హయాంలో సాగర్ ఆధునికీకరణ పనులు 30 శాతమే జరిగాయని.. తాము మూడేండ్లలోనే 65 శాతం సాగర్ ఆధునికీకరణ పనులు చేశామని హరీశ్ రావ్ అన్నారు.  ప్రతి రంగంలో దేశానికి ఆదర్శంగా నిలబడ్డామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు