యముళ్ల నుంచి భర్తను కాపాడుకున్న మరో సావిత్రి ! - MicTv.in - Telugu News
mictv telugu

యముళ్ల నుంచి భర్తను కాపాడుకున్న మరో సావిత్రి !

February 22, 2018

ఓ మహిళ ధైర్యసాహసాలు ప్రదర్శించి యమ కింకరల భారీ నుంచి తన భర్తను కాపాడుకుంది. ఈ సంఘటన హరియాణా రాష్ట్రంలోని యమునానగర్‌లో జరిగింది.  ఓ వ్యక్తిని నలుగురు వ్యక్తులు చుట్టుముట్టి కర్రలతో అతనిపై తీవ్రంగా దాడి చేశారు. తన భర్తను నలుగురి వ్యక్తులు  దాడి చేయడంతో ఆ సదురు మహిళ కర్ర తీసుకుని  ఒక్కసారిగా వారి మీద తిరగబడి, వారిని తరిమి కొట్టింది. అయితే తీవ్రంగా కొట్టడంతో బాధిత వ్యక్తి  అపస్మారక స్తితిలోకి వెళ్లిపోయాడు.  ఆ తర్వాత అతనిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ మొత్తం సంఘటనను అక్కడే ఉన్న ఓవ్యక్తి తన సెల్ ఫోన్‌లో వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతోంది. ముష్కరుల నుంచి తన భర్త ప్రాణాలను కాపాడుకున్న సావిత్రి అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.