బాలీవుడ్ నటితో హార్థిక్‌పాండ్యా  ప్రేమాయణం.... - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్ నటితో హార్థిక్‌పాండ్యా  ప్రేమాయణం….

March 6, 2018

భారత ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా, స్వీడన్ మోడల్ ఎల్లి అవ్రామ్‌తో డేటింగ్  చేస్తున్నాడు. గత కొంతకాలం నుంచి వీరిమధ్య ప్రేమాయణం నడుస్తున్నట్టు తెలుస్తోంది. హర్థిక్ అన్నయ్య క్రికెటర్ కృనాల్‌పాండ్యా వివాహానికి కూడా ఎల్లీ హాజరైంది. ఆ పెళ్లి‌లో ఇద్దరూ చాలా క్లోజ్‌గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  తాజాగా ఎల్లీతో కలిసి హార్ధిక్ ఎయిర్‌పోర్టులో కనిపించాడు. ప్రూఫ్ దొరికింది.. ఎల్లీ, పాండ్యా డేటింగ్‌లో ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఎల్లీనే స్వయంగా హార్ధిక్ పాండ్యాను ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేసి బాయ్ బాయ్ చెప్పినట్టు  ఫోటోలు చూస్తే తెలుస్తోంది. అయితే మీడియాతో సహా కొందరు క్రికెట్ అభిమానులు వీరి వాహనం వద్దకు రాగానే ఎల్లీ అవ్రామ్ జట్టుతో ముఖాన్ని కప్పి ఉంచే ప్రయత్నం చేయడం కెమెరా కంట పడింది. హార్ధిక్ మాత్రం తనకేం సంబంధం లేదన్నట్లుగా లగేజీ బ్యాగ్‌తో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారత్, బంగ్లాదేశ్, శ్రీలంకల మధ్య ప్రారంభంకానున్న ముక్కోణపు టోర్నీ నుంచి పాండ్యాకు విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే.