టీచర్లు అర్చక వృత్తి చేయాలి - MicTv.in - Telugu News
mictv telugu

టీచర్లు అర్చక వృత్తి చేయాలి

November 1, 2017

ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా అర్చక శిక్షణ తీసుకోవాలన్న హరియాణా ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.  అర్చక శిక్షణ తీసుకున్న టీచర్లు, వారు విధులు నిర్వహించే గ్రామాల్లో పండుగలు, ఇతర పర్వదినాలు సందర్బాల్లో అర్చకత్వం చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.

అయితే కొందరు టీచర్లు దీన్ని పాటించలేదు. ఇది లౌకిక వాదానికి వ్యతిరేకమని మండిపడుతున్నారు. దీంతో వారిపై సర్కారు కన్నెర్రజేసింది. అక్టోబర్ 29న ప్రభుత్వం నిర్వహించిన అర్చక శిక్షణకు హాజరు కాని టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మనోహర్‌లాల్ ఖట్టర్ సర్కారు అధికారులను ఆదేశించింది.  అర్చక కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాలని టీచర్లుకు అధికారులు నోటీసులు జారీ చేశారు.