జల్లికట్టు ఆందోళనలో చనిపోయిన ఓ యువకుడి కలను నిజం చేశాడు నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్. అతను బతికుండగా సొంతిల్లు కట్టాలని అనుకున్నాడట. ప్రమాదవశాత్తు జల్లికట్టులో చనిపోవడంతో అతని కలను తెలుసుకున్న లారెన్స్ వెళ్లి వాళ్ళ కుటుంబానికి ఇల్లు కట్టించి గృహప్రవేశం కూడా చేయించాడు. ఈ విషయాన్ని లారెన్స్ సోషల్మీడియా ద్వారా తెలిపాడు. ఇది తన బాధ్యత అని ట్వీట్లో పేర్కొన్నాడు.
Hi dear Friends and Fans..! This is not a help but my responsibility pic.twitter.com/MNdTX4QKqC
— Raghava Lawrence (@offl_Lawrence) February 7, 2018
‘ గతేడాది మనందరం కలిసి ఎంతో పట్టుదలతో జల్లికట్టును సాధించుకున్నాం. దురదృష్టవశాత్తు ఆందోళన సమయంలో యోగేశ్వర్ను కోల్పోవడం చాలా బాధాకరం. జల్లికట్టు విజయం మనకు ఎంత ముఖ్యమో.. ఆ యువకుడి కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం కూడా అంతే ముఖ్యం. అది మన బాధ్యత. యోగేశ్వర్ తన కుటుంబం కోసం ఏం చెయ్యాలనుకున్నాడో అది నేను చేస్తానని అతడి తల్లికి యోగేశ్వర్ అంతక్రియల రోజున మాటిచ్చాను.
నేను వారి కుమారుడిగా ఈ కాస్త బాధ్యతను నెరవేరుస్తున్నందుకు ఆనందంగా వుంది. ఈరోజు గృహప్రవేశం.. మీ అందరి ఆదరణ, ఆశీర్వాదాలు నాక్కావాలి ’ అని పేర్కొన్నారు లారెన్స్. కాగా లారెన్స్ మానవతా హృదయాన్నిచాలా మంది నెటిజనులు కొనియాడుతున్నారు. గతంలో కూడా లారెన్స్ అనాధ బాలల కోసం, వికలాంగుల శ్రేయస్సు కోసం పలు సేవలు చేశాడు.