తాగుడుకు డబ్బివ్వలేదని ఇంటికి నిప్పు.. - MicTv.in - Telugu News
mictv telugu

తాగుడుకు డబ్బివ్వలేదని ఇంటికి నిప్పు..

March 1, 2018

తాగుబోతులకు  మైండూ, బాడీ రెండూ దొబ్బేస్తాయి. . ఓ మందుబాబు మందుకు డబ్బివ్వలేదని దగ్గరి బంధువు ఇంటికే నిప్పెట్టాడు.  చెన్నైలోని కుమారపురం సమీపంలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.33 ఏళ్ల రఘు కూలీ పని చేసుకుంటూ  తక్కలై దగ్గర్లో కుమారపురంలో నివసిస్తున్నాడు. ఇతనికి తాగుడు పిచ్చి. కూలీ డబ్బులు తాగుడుకే తగలేసేవాడు. లేనినాడు తన ఇంటికి దగ్గర్లో వున్న బంధువైన శాంతమ్మ ( 70 )ను డబ్బుల కోసం వేధించేవాడు. ఆమె భర్త చనిపోవటంతో ఒంటరిగానే కూలీ పని చేసుకొని జీవిస్తోంది. రఘు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేది.ఆరోజు కూడా ఎప్పటిలాగే రఘు మద్యం సేవించడానికి ఆమెను నగదు అడిగాడు. శాంతమ్మ తన దగ్గర లేవంది. దీంతో ఆగ్రహించిన రఘు ఆమె ఇంటికి నిప్పు పెట్టి పరారయ్యాడు. ఒకవైపు నుండి ఇంటికి మంటలు అంటుకోవటం గమనించిన స్థానికులు మంటలు ఆర్పారు. అప్పటికే ఇంటి పైకప్పు మొత్తం కాలి బూడిదయ్యింది. స్థానికుల సమాచారంతో రంగప్రవేశం చేసిన పోలీసులు రఘును అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు.